మహనీయులు గిడుగును స్మరించుకుందాం..
1 min read– అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్థానిక పత్తికొండ పట్టణంలో ఉన్న శాంతి టాలెంట్ స్కూల్ లో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ లక్ష్మి అధ్యక్షతన అరసం ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, డాక్టర్ లక్ష్మణ స్వామి వ్యావహారిక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నేడు మన పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలో బోధిస్తున్నాము అంటే అందుకు కృషి చేసిన మహనీయులు గిడుగు రామమూర్తి,అందుకే ఆయనను నేడు స్మరించుకోవాలి అని అన్నారు.నేడు వ్యవహారిక భాష లో విద్యాబోధన జరుగడానికి,మాతృ భాషలో విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారని నాడు గట్టిగా పట్టుబట్టి ఉద్యమాన్ని నడిపించి, సాధించిన గిడుగు చిరస్మరణీయుులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి నిర్వహించిన నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నది.ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన సిబ్బంది నాగరాజు,హమీద్,రహంతుల్లా, ఈశ్వరి, విజయభారతి,మహబూబ్ బి, షమీమ్ శాంతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.