PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇసుక అక్రమరవాణా పై మంత్రాలయంలో సత్యాగ్రహం

1 min read

– రాష్ట్రంలో ఇసుక మాఫియా తో వేల కోట్లు దోచుకున్న ఏకైక పార్టీ వైసీపీ

– రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ దే అధికారం

–ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో తెదేపా ఇన్ చార్జ్ లు మంత్రాలయం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, ఆదోని ఇన్ చార్జ్ మీనాక్షి నాయుడు, ఎమిగేనూరు ఇన్ చార్జ్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, పత్తికొండ ఇన్ చార్జ్ కెయీ శ్యామ్ బాబు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలోని ఈ నిన్నటి దినమున  కార్యక్రమం నిర్వహించాగ, మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం లోని గుడికంబాలి గ్రామంలో ఇసుక రీచ్ దగ్గర ఇసుక అక్రమ రవాణా కు వ్యతిరేకంగా స్థానిక ఇసుక రీచ్ ల దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వాన్ని నిలదీశారు మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం గుడికంబలి గ్రామంలో ఇసుక రీచ్ దగ్గర మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గం ఇన్ చార్జ్ మీనాక్షి నాయుడు, ఎమిగేనూరు నియోజకవర్గం ఇన్ చార్జ్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి,పత్తికొండ నియోజకవర్గం ఇన్ చార్జ్ కెయీ శ్యామ్ బాబు,పరిశీలకులు శ్రీమతి శివబాల, సబితమ్మ,పాల్గొని వారు మాట్లాడుతూ  ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కొత్త ఇసుక పాలసీ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే ఇసుక ని దొరక్కుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేయడం వల్ల తత్సంబంధిత  కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని ఆ తర్వాత ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లను నెలకొల్పి ఆయా స్థానిక ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ఇసుకను అక్రమంగా పక్క రాష్ట్రాలకు  తరలిస్తూ భారీగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని తద్వారా ప్రజాధనం దోపిడీకి గురి కావడమే కాకుండా ప్రజలకు ఇసుక అనేది దొరక్కుండా చేస్తున్నారని ఇలాంటి విధానంలపై ముఖ్యమంత్రి  వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలని కోరారు అంతేకాకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మునుపటిలాగే అందరికీ సరళంగా ఇసుక దొరికే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు అనంతరం అక్రమ ఇసుక రవాణా చేస్తూన్న వారిపై చర్యలు తీసుకోవాలని కౌతాళం యస్ ఐ కు పిర్యాదు చేశారు. రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు  తోనే సాద్యం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి,తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు యువత కర్నూలు జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోట్రేష్ గౌడ్,కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న,నాడిగేని రంగన్న, చావిడి వెంకటేశ్వర్లు,రమేష్ గౌడ్, బిసి సాధికార రాష్ట్ర సభ్యులు కురువ మల్లికార్జున, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి,వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శేట్ట,తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి,నాడిగేని మహదేవ్,పవన్ కూమర్ రెడ్డి, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణ రెడ్డి,ఆర్ టి యస్ ప్రోగ్రామ్ కోర్డినేటర్ దశరధిరాముడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చూడి శివమూర్తి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు,మైనారిటీ నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తాన్, జిల్లా కార్యదర్శి రహ్మాన్,వగరూరు అబ్దుల్ సాబ్, డాక్టర్ సెల్ అధ్యక్షులు రాజానంద్,బెళగల్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ రామయ్య, యస్ సి సెల్ నాయకులు విజయకుమార్, రాజాబాబు,బోగ్గుల నరసన్న,సురేంద్ర, యం పి టి సి సభ్యులు రాజు,ఉరుకుందప్ప, దేవన్న,  ఐ టిడిపి బృందం సల్మాన్ రాజు,మంజునాత్ డేని, నీలకంఠ,ఉసేని,చిదానంద, నాగేష్,హనుమంతు, నాలుగు మండలాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author