శ్రీ రాజ రాజేశ్వరి పాఠశాల లో తెలుగు భాష దినోత్సవం
1 min read– స్పోర్ట్స్ డే వేడుకలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాదిరాజు రామేశ్వరరావు మాట్లాడుతూ . తెలుగు భాష గొప్పదనాన్ని గురించి మనసులోని భావాలను వ్యక్తీకరించడంలో మాతృభాషను మించిన భాష లేదని. మన భాషను బ్రతికిద్దాం, మన భాషను గౌరవిద్దాం, పాలలో ఉన్న స్వచ్ఛత, తేనెలో ఉన్న మాధుర్యం, కలగలిపిన పదజాలమే తెలుగు భాష. మనం పరాయి భాషలు ఎన్నెన్నో నేర్చుకోవచ్చు కానీ తల్లి భాషను మర్చిపోకూడదని వివరించారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహానీయుడు గిడుగు వెంకట రామమూర్తిని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం మాతృభాషా దినోత్సవం మరియు స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు , వకృత్వపు పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది . ఈ కార్యక్రమంలో యం. బి . ఎన్ .రాఘవేంద్ర రావు యం. నాగ కృష్ణకాంత్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేశారు.