ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
1 min read– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన తాగుతున్నదని కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని శివాలపల్లెలో నూతనంగా నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సాగిస్తున్నారని తెలిపారు, ప్రజా ఆరోగ్యానికి కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేస్తూ ప్రతి సచివాలయ పరిధిలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటుచేసి గ్రామీణ వైద్యానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు, అలాగే వైయస్సార్ క్లినిక్ నందు మంచి సదుపాయం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు, గతంలో ఏ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పై ఇంతలా దృష్టి సారించలేదని ఆయన తెలిపారు, గ్రామీణ ప్రజలు చిన్నపాటి వ్యాధులకు పట్టణాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయడం నిరుపేద కుటుంబాలకు భారంగా మారిందని ఆయన అన్నారు, అన్ని వర్గాల వారికి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే వైయస్సార్ విలేజ్ క్లినికులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ నాగరాజు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి.చెన్నారెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఉప మండల అధ్యక్షుడు ఆర్ ఎస్ ఆర్( చిన్న) మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్మూర్తి సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, చిన్న కొండారెడ్డి, పెద్ద పుల్లయ్య , రామ సుబ్బారెడ్డి రఘు రామిరెడ్డి, ఎర్రసాని మోహన్ రెడ్డి, నీలం వెంకటసుబ్బారెడ్డి నిత్య పూజయ్య, రామన చంద్ర మోహన్రెడ్డి, అబ్దుల్ రబ్, అన్వర్, ఎంపీడీవో సురేష్ బాబు, ఏఈలు మురళీకృష్ణ, మినీల్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.