వర్షభావ పరిస్థితులు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
1 min read– ఏపీ రైతుసంఘం జిల్లాకార్యదర్శి తిమ్మయ్య డిమాండ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: వర్షభావ పరిస్థితులవల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య మౌలా సాబ్ డిమాండ్ చేశారు. ఈ సారి వర్షాలు కురవక నష్టపోయిన పంట పొలాలను ఈ రోజు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జూన్, జులై మాసాలలో అరకొర వర్షాలు కురవడం తో పంటలు పెరగలేదని, ఆగస్టు మాసం లో అసలే వర్షాలు లేక పత్తి, వేరుశెనగ, సజ్జ, జొన్న, కంది, ఆముదం పంటలు ఏమాత్రం ఎదుగుదల లేక,పూత, కాయలు లేక ఏ మాత్రం పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అన్నారుపత్తి వేరుశెనగ, జొన్న, సజ్జ, ఆముదం పంటలనుసాగుచేయడానికిసుమారుగాఎకరానికి ముప్పై వేలనుండ యాభై వేలు ఖర్చు అవుతుంది గత* మూడుసంవత్సరాల నుండిపంటలు పండక పెట్టుబడులు కు వడ్డీలేక రైతు సుంకమ్మ అనే మహిళ తన కొడుకులు పెట్టుబడి పెట్టలేక అప్పులపాలై పురుగులు మందు తాగే పరిస్థితి వచ్చిందిని ఆమె బాధతో ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారుల దగ్గర అప్పులు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించే పరిస్థితి లేదని అన్నారుఅందుకనే పంటలు సాగుచేసి నా రైతులను ఆదుకోవాలని అలాగే 60 సంవత్సరాల పైబడిన కౌలు రైతులకు నెలకు 5000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇబ్రహీం సలాం సాబ్ హిమహిత్ మల్లికార్జున రుద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.