మహాశక్తి మహిళలకు వరం..
1 min read– టీడీపీ అధికారంలోకి వస్తేనే మహిళల అభ్యున్నతికి ఆస్కారం.
– 20ఏళ్ల క్రితమే డ్వాక్రా మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగు దేశం పార్టీ ఆ్ధ్వర్యంలో విడుదల చేసిన మినీ మ్యానిఫెస్టోలోని మహాశక్తి పథకంతో మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి పేర్కొన్నారు.బుధవారం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి స్వగృహంలో బాబు ష్యురిటీ.. భవిష్యత్తు గ్యారంటీ పై నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, అమ్మకు వందనం కింద రూ.15వేలు, ఇంట్లోని మహిళలందరికి నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలను ఆదుకున్నామని వివరించారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచి దోచుకుందిని విమర్శించారు.ఈ నెల రోజులు బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి బూత్ లో తిరుగుతారు, మీ ఓటు ఉందో లేదో చూసుకోండి, మీ ఫోటో ఉందో లేదో చూసుకోండని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ తో కలిసి తిరగాలి, బిఏల్ఓ జాగ్రత్తగా లేకపోతే వారు మీ ఓట్లు తీసేస్తారని, ఇంట్లో తల్లి ఓటు ఒక చోట, కొడుకు ఓటు ఒక చోట ఉన్నాయి, తండ్రి కొడుకు ఓట్లు ఇంకోచోట ఉన్నాయన్నారు. జగన్ రెడ్డికి పీకే టీం గెలవం అని రిపోర్ట్ ఇచ్చింది, ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేర్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలి అన్నారు. మన పధకాలను ప్రతి ఇంటికి తీసుకెళాల్సిన అవశ్యకత మన మీద ఉంది, సూపర్ సిక్స్ ను ప్రజలకు వివరించండి కార్యకర్తలకు సూచించారు.కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు దేవాళ్ళ మురళి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్లు పలుచాని మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి, మైనార్టీ నాయకులు షకీల్ అహమ్మద్, జాకీర్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు.