కొండపేట లో వైభవంగా బలరామ పౌర్ణమి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం కొండపేట గ్రామంలో వెలిసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం .ఇస్కాన్. వారి ఆధ్వర్యంలో గురువారం ప్రధాన రామాలయంలో బలరామ పౌర్ణమి ఉత్సవాలు ఇస్కాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు. కొండపేట గ్రామంలోని రామాలయంలో ఇస్కాన్ భక్తులు ఉదయం 4.30. గంటల నుండి మంగళహారతి. ఉదయం5.30. గంటల నుండి7.30. వరకు నిర్వహించారు. ఉదయం8.30 గంటల నుండి11.15 గంటల వరకు భజన. కీర్తన. కథ నిర్వహించారు. ఉదయం11.15 గంటల నుంచి శంఖాభిషేకం ఉదయం11.40 గంటల వరకు పుష్పాభిషేకం మధ్యాహ్నం12.00 గంటలకు పంచహారతి వందలాదిమంది భక్తులు తిలకిస్తుండగా బలరామకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం12.15 గంటలకు భక్తులకు ఉచిత అన్నదాన మహా ప్రసాద వితరణ చేశారు.సాయంత్రం4.30. గంటల నుండి కొండపేట పురవీధుల గుండా బలరామకృష్ణులతో కూడిన ఉత్సవ విగ్రహాలను నగర సంకీర్తన చేశారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు మండలం నుంచి కాకుండా కడప. ప్రొద్దుటూరు మైదుకూరు. కాజీపేట. ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇస్కాన్ భక్తులు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన భగవద్గీత పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.