NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘోర అగ్నిప్రమాదం…

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  లలితాంబిక వాణిజ్య సముదాయం గురువారంవేకువజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 14 దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలు పైనఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. ఎల్ బ్లాక్ నందు20 షాపులకు గాను14దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం షార్ట్‌ సర్కూట్‌ ద్వారా జరిగిందా…లేదా ఇతర కారణాలున్నాయా? అని శ్రీశైలం  పోలీసులు,  ఫైర్‌ అదికార బృందం విచారణ చేపడుతున్నాయి. 14దుకాణాలు పూర్తి స్థాయిలో కాలిపోయాయి శ్రావణమాసం కావడంతో వ్యాపారస్తులు అధిక మొత్తం సరుకులు తీసుకొచ్చారు    తెచ్చిన సరుకు పూర్తిగా కాలిపోవడంతో భాదితులు తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి స్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఈవో లవన్న ఆదేశించారు. 

ప్రమాదఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి

లలితాంబిక వాణి సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని పరిశీలించాడు 14దుకాణాలు పూర్తిగా

అగ్నికి ఆహుతి అయ్యాయి సంబంధిత దుకాణదారులను పరామర్శించాడు ఎమ్మెల్యే తక్షణ సహాయం కింద ఒక్కొక్క షాపుదారుడికి20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందేలాగా కృషి చేస్తా అన్నాడుఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరమని అన్నాడు 14 షాపులను తిరిగి పునర్నిర్మించి షాపుదారులకు అందజేస్తామన్నాడు.

About Author