కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమరభేరీ
1 min read– నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : 1 ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్రంలో జరుగు నిరసన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రాధాకృష్ణ సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు సమరభేరీ గోడ పత్రికలను స్థానిక బస్టాండ్ లో విడుదల చేయడం జరిగింది.కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నది.ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలనే అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారు. ప్రభుత్వాలు వేస్తున్న ఈ భారాలకు వ్యతిరేకంగా, దేశవ్యాపితంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, కరెంట్ చార్జీలు తగ్గించాలని సిపియం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మోడీ గద్దెనెక్కిన వెంటనే 450 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర నేడు 1200 రూపాయలకు పెరిగింది. 2014 మార్చిలో ప్రపంచంలో చమురు ధర 105.30 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో పెట్రోల్ రూ.78.43/-, డీజిల్ రూ.55.48 రేట్లు ఉన్నాయి. 2023 మార్చిలో చమురు ధర 78.43 డాలర్లు ఉంటే పెట్రోల్ రూ.112/ – డీజిల్ రూ.96/-లకు మోడి ప్రభుత్వం పెంచింది.ఈ కార్యక్రమంలో హమాలీలు ఈడిగా రాముడు.పులి వన్నూరు.ఉలిగయ్య. గురుప్రసాద్.కోనేరు వెంకటేష్. రాము ఈరన్న తదితరులు పాల్గొన్నారు.