సెప్టెంబర్ 6 న విహెచ్పి కేంద్రీయ ప్రధాన కార్యదర్శి కర్నూలు పర్యటన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ వచ్చే నెల సెప్టెంబర్ 6 నుండి అనగా గీతను బోధించిన జగద్గురువు సాక్షాత్ శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కర్నూలు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరం లో విశ్వ హిందూ పరిషత్ “షష్ట్యబ్ది” ఉత్సవాలను ప్రారంభించడం కోసం విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి (కేంద్రీయ ప్రధాన కార్యదర్శి) మాన్య శ్రీ మిలింద్ పరాండే కర్నూలు కు విచ్చేస్తున్నారని ఈ రోజు ఉదయం 11:00 గం.లకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం,పుల్లారెడ్డి భవన్, రెవెన్యూ కాలనీ లో జరిగిన కార్యకర్తల సమావేశం లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి శ్రీ మిలింద్ పరాండే గారి పర్యటన విశేషాలను వివరిస్తూ వారు 6/9/23 వతేది మధ్యాహ్నం ఉ.7:30 కు కర్నూలు రైల్వేస్టేషన్ కు చేరుకుంటారని అక్కడి నుండి నేరుగా సాయిరెడ్డి గారి నివాసానికి వెళ్తారు,10:00 రాష్ట్ర కార్యాలయంలో జరిగేలా స్ట్రా కార్యవర్గ సమావేశానికి వెళతారు, 12:30 నుండి 1:15 వరకు విలేఖరుల సమావేశంలో అక్కడే పాల్గొంటారనీ, అనంతరం సాయంత్రం 4::00 గం.ల నుండి 5:30 గం.ల వరకు విధిప్రకోష్ట(లీగల్ సెల్) సమావేశం సందర్భంగా కర్నూలు నగరం, జిల్లా లోని అడ్వకేట్ లతో సమావేశంలో పాల్గొంటారనీ అనంతరం 6:00 కు విశ్వ హిందూ ” పరిషత్ 60 సంవత్సరపు ఆవిర్భావ సభ ” లో పాల్గొని రాత్రి బయలుదేరి తమ తర్వాతి పర్యటనా స్థలానికి బయలుదేరతారని కావునా కర్నూలు నగరంలోనే కాక జిల్లావ్యాప్తంగా ఉన్న కులసంఘాల కార్యకర్తలు, ధార్మిక సంస్థలు ప్రతినిధులు, అశేష హిందూ సమాజంలోని స్త్రీలు,పురుషులు,యువతీ ,యువకులు వివిధ వృత్తులలో పనిచేసే వృత్తి విద్యా నిపుణులు తదితరులు వందలాదిగా ఈ కార్యక్రంమంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి పిలుపు నిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ” కరపత్రాన్ని” ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్,రాష్ట్ర కోశాధికారి సందడి మహేష్,రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి,విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి,బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ, ధర్మ ప్రసార్ కన్వీనర్ కాళంగిరి విజయుడు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శి గోవిందరాజులు,బజరంగ్ దళ్ కన్వీనర్ రాజేష్,సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్, గో రక్షా కన్వీనర్ శివశంకర్, కోశాధికారి అయోధ్య శ్రీనివాసరెడ్డి, మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి రాధిక,దుర్గావాహిని కన్వీనర్ శ్రీమతి ఈపూరి లక్ష్మీ,నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి,ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు,కార్యదర్శి ఈపూరి నాగరాజు బజరంగ్ దళ్ కన్వీనర్ భగీరథ,మరియు ప్రఖంఢ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు,బజరంగ్ దళ్,మాతృశక్తి,దుర్గావాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.