PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గార్గేయ పురంలో… ‘నా మట్టి..నాదేశం’..

1 min read

ఇంటింటికి వెళ్లి మట్టి సేకరించిన మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్​

  • దేశంపై భక్తి పెంపొందించడమే లక్ష్యం : బీజేపీ

పల్లెవెలుగు: కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్​ ఇంటింటికి వెళ్లి మట్టిని సేకరించారు. దేశంలో బీజేపీ నేతృత్వంలో చేపట్టిన నా మట్టి–నాదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ రాజ్య సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కోడుమూరు నియోజకవర్గ ఇన్​చార్జ్​ ప్రేమ్​ కుమార్​ తదితరులు మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్​ మాట్లాడుతూ  భారతదేశ ప్రజలు బలంగా ఉంటే .. దేశం కూడా బలంగా ఉంటుందన్న సద్భావనతో బిజెపి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.  మన మట్టిని, మనం తల్లితో పోల్చుకుంటాం.. అలాగే దేశాన్ని కూడా తల్లితో పోల్చుకుని భరతమాతగా పూజించుకుంటున్నాం..ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం బలమైన దేశంగా మారింది.  ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా భారతదేశం పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది.. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ దేశీయులు బార్డర్ దాటాలంటే భారతీయ జెండాలు పట్టుకుని దాటారంటే ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట ఏంటో అర్థం అవుతుంది.. ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే,  మోడీనే ప్రధాని కావాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అంటే, మోడీ ప్రతిష్ట అంటే ఏమిటో అర్థం అవుతుంది. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న ఘనత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు 90 శాతం నిధులను కేంద్రమే ఇస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ గాని, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ గానీ ఏర్పాటు అయిందంటే అది కేంద్ర ప్రభుత్వ ఘనతనే. గార్గేయపుర గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని బిజెపి పార్టీ దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

About Author