ఆరోగ్యకరమైన ఆహారంతో మీ జీవితం పదిలం
1 min read– జాతీయ పోషకాహార వారోత్సవాలు
– సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు
షేక్ ఫర్వీన్ భానుకన్సల్టెంట్ డైటీషియన్ కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి ఒక్కరూ తగిన పోషకాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడుతారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో జాతీయ పోషకాహార వారోత్సవలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన ఆహారాలు అందరికీ అందుబాటులో అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారు. మనిషి యొక్క ఆరోగ్యానికి వారి యొక్క జీవనశైలి మరియు ఆహార అలవాట్లు నిర్ణయిస్తాయి. పౌష్ఠికాహారం అంటే అది ఖరీదైన ఆహారం అనే ఒక అపోహ ఉంది. కానీ తక్కువ ఖరీదైన ఆహారాలు ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారాలు మనకు లభిస్తున్నాయి. వాటిన మనం ఎంచుకోవడంలో మన సరైన నిర్ణయం దాగి ఉంటుంది.
మనిషి ఆరోగ్యానికి అతి ముఖ్యమైనవి
– కార్బొహైడ్రైట్స్
– ప్రోటిన్స్
– మైక్రో మరియు మాక్రో న్యూట్రిన్స్
– ఫైబర్ (పీచు పదార్థాలు)
– కొవ్వు పదార్థాలు
– యాంటి ఆక్సింటెట్స్
కార్బోహైడ్రైట్స్:
తెల్లని బియ్యం కన్నా సింగిల్ పాలిష్ పట్టిన బియ్యం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. సింగిల్ పాలిష్ బియ్యంలో ఫైబర్, బి-కాంప్లెక్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు లభిస్తాయి. వీటిని మనం నేరుగా మిల్లు దగ్గర తగిన సీజన్లలో కొనేగోలు చేయడం వల్ల మనకి తక్కువ ధరలో లభిస్తాయి. దుంపకూరలు అనగా బిట్ రూట్, బంగాళదుంప, క్యారెట్, చిలగదుంప, కందగడ్డ వీటివల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రైట్స్, ఖనిజలవణాలు, ఫైబర్, మెగ్నీషియం లభిస్తాయి. వీటి వల్ల హార్మోన్ల ఉత్పత్తి, గుండె లయబద్ధంగా కొట్టుకోవడానికి, నరాలు మరియు కండరాల యొక్క మెరుగైన పనితీరుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
ప్రోటీన్స్: మనిషికి సరియైన శరీరాకృతి కోసం సమృద్ధిగా ప్రోటీన్స్ కలిగివున్న ఆహారం తీసుకోవాలి దీనిలో రెండు రకాలు ఉంటాయి. అవి వెజ్ ప్రోటీన్స్, నాన్ వెజ్ ప్రోటీన్స్
వెజ్ ప్రోటీన్స్ : సోయాబిన్స్, సోయా పన్నీర్, సోయా మిల్క్, సోయా పెరుగు, పెసలు, అలసందలు, శెనగలు, కబుళి శెనగలు, మినపప్పు, వేరుశెనగ గింజలు, ఉలవలు, కందులు, సోయాబిన్స్ కలిపిన గోధుమలు, జొన్నల పిండితో చేసిన రొట్టెలు, చపాతిలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఉదహారణకు : 5 కేజీల గోధుమలో, జొన్నలలో 75 గ్రాములు సోయాబిన్స్ కలిపి తీసుకోవాలి. సోయాబిన్స్ 36 గ్రాములు, సోయచంగ్స్ 52 గ్రాములు, మినపప్పు 23 గ్రాములు, శెనగపప్పు 90 గ్రాములు, పెసరపప్పు 24 గ్రాములు, వేరుశెనగ గింజలలో 23 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
నాన్ వెజ్ ప్రోటీన్స్:మటన్ 25 గ్రాములు, చికెన్ 25-30 గ్రాములు, చేపలు 16-18 గ్రాములు, రొయ్యలు 25 గ్రాములు, 1 గుడ్డులో 6.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. మైక్రో మరియు మాక్రో న్యూట్రిన్స్
వీటిని మనం చిరరుధాన్యాల నుండి పొందుతాం. మరియు చిరుధాన్యాల నుండి పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. వీటిలో కలిగివున్న వాటితో టైప్-1, టైప్-2 డయాబెటిస్ కలిగిఉన్నవారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిని వారు ప్రతిరోజు తీసుకోవాలి.
కొర్రలు: వీటిలో ఫైబర్, ప్రోటీన్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.
రాగులు: వీటి వల్ల మనం ఉబకాయాన్ని ఎదుర్కొనవచ్చు.
అండు కొర్రలు: ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎంతో మంచి ఆరోగ్యం.
వరిగలు: గ్లుటన్ ఫ్రీ మిల్లెట్ అధిక మినరల్స్, ఫైబర్ మరియు ఫాలీఫైనల్స్ కలిగిన మిల్లెట్స్.
ఈ చిరుధాన్యాలను నేరుగా రైతుల నుండి సీజన్ లో కొనుగోలు చేయడం వలన మనకి తక్కువ ధరలో లభిస్తాయి.
జొన్నలు / సజ్జలు
రైబోప్లెవిన్, థయమిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువ మోతాదులో కలిగిన ధాన్యాలు ఇవి మానవాళికి ఒక వరంగా చెప్పుకోవచ్చు. వీటిని ప్రతిరోజు ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వయసు వాళ్లు అందరూ ప్రతి రోజు రొట్టెల రూపంలో తీసుకోవడం వలన జీవనశైలి, జబ్బులు, షుగర్ మరిము బిపిని అరికట్టవచ్చు. అతిముఖ్యంగా చిన్నప్పటి నుండి చిరుధాన్యాల, జొన్నలు, సజ్జలు, రొట్టెల రూపంలో అలవాటు చేయడం వలన ముందు తరాలని బిపి, షుగర్ అనే వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. ప్రతి రోజు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవలెను. తగు మోతాదులో ప్రతి రోజు మంచి కొవ్వు కలిగిన నెయ్యిని పిల్లలకి అలవాటు చేయాలి. తక్కువ ధరలో లభించే అధిక పోషకాలు కలిగిన పదార్థాలు
– వేరుశెనగలు
– అవిసగింజలు
– చేపలు
– గుడ్లు
– సోయాపాలు, సోయా చంగ్స్
– పండ్లు అంటే జామా, అంజిర్, బొప్పాయి, బత్తాయి
– అన్ని రకాల చిరుధాన్యాలు
– ఆకుకూరలు
– కూరగాయలు
– సముద్రపు చేపలు, వీటిలో ఒమైగా-3 ఫాటీయాసిట్స్ కాల్షియం, పుష్కలంగా లభించును.
– వేరుశెనగ గింజల నుండి తీసిన పాలు, నువ్వుల గింజల పాలు
– గుమ్మిడి విత్తనాలు
– మొలకెత్తిన విత్తనాలు