జగనన్న కాలనీ లే అవుట్ ను పరిశీలించిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి
1 min read– వేగవంతంగా జగనన్న ఇళ్ల నిర్మాణం..
– ఇంచార్జ్ హౌసింగ్ పిడి ఆర్ విజయరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: పెదపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెదపాడు మండలం అప్పనవీడు జగనన్న కాలనీలో లే అవుట్ లలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి డా.జి. లక్ష్మీషా సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అప్పనవీడుజు లేఅవుట్ లో 287 ప్లాట్లు వేశారని అందులో ఇప్పటివరకు 44 మంది ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయగా మిగతా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వున్నాయన్నారు. ఈ సందర్భగా హౌసింగ్ ఎండి గృహ నిర్మాణ లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గృహ ప్రవేశాల కార్యక్రమం నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలంలో ఓపిఎస్ పట్టాలు రిజిస్ట్రేషన్ 8 కిగాను 3 పూర్తయ్యాయని, 5 రిజిస్ట్రేషన్లు రేపటిలోగా పూర్తిచేస్తామని అధికారులు ఆయనకు తెలిపారు. ఈ పరిశీలనలో ఎలక్ట్రికల్, వాటర్ కు సంబంధించిన బోరును , రోడ్లు, తదితర పనులను ఆయన పరిశీలించారు. రాబోయే రోజుల్లో లేఅవుట్ లో ఉన్న 287 ప్లాట్లను గృహనిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇసుక, సిమెంట్, ఇటుక తదితర గృహనిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇంఛార్జి పిడి. ఆర్. విజయరాజు, హౌసింగ్ డిఇ రమాకాంత్, టెక్నికల్ అసిస్టెంట్ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.