PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆనందం ఉంది…

1 min read

– ఆత్మీయ కృతజ్ఞత సమావేశంలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఎప్పటినుండో అపరిస్కృతంగా అక్కడ ఉన్నటువ ప్రజా సమస్యలను ప్రజలు చెప్పినప్పుడు, ఆ సమస్యలను రాష్ట్రస్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు తెలియజేసి  అక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరించినప్పుడు వచ్చిన సంతోషం మరి ఎక్కడ దొరకదని, ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంగా భావిస్తానని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, మంగళవారం స్థానిక గోసుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కృతజ్ఞత సభ లో ఆయన మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా ఇందుకు సహకరించిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, గ్రామ సచివాలయ కన్వీనర్లకు, గృహ సారధులకు, వాలంటీర్లకు, వైయస్సార్సీపి శ్రేణులకు ప్రతి ఒక్కరికి ఆత్మీయ కృతజ్ఞతలు  ఆయన తెలిపారు, ప్రజలకు చిత్తశుద్ధితో మనం పని చేసినప్పుడు, ఆ సమస్యలు పరిష్కారమై ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు, కలిగే సంతోషం అంతా ఇంత కాదన్నారు, ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలం లో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి అక్కడి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు, ప్రజలకు ఇంకా ఏవైనా సంక్షేమ పథకాలు టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోయి ఉంటే వారిని అడిగి తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందని తెలిపారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి కలిగిన నాయకుడు కాబట్టి ఆయన తన పాదయాత్రలో భాగంగా ఏ వైద్య ప్రజా సమస్యలు తెలుసుకున్నాడో వాటిని పరిష్కరించేందుకు ముందుగానే నవరత్నాలు ద్వారా  పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందివ్వడం జరిగిందన్నారు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిభావంతం కలిగిన నాయకుడు కాబట్టి ఆయన పరిపాలన అంతా కూడా తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించే దిశగా సాగిందని తెలిపారు, ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సువర్ణపాలనలో ఆయన చేసిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ఇందులో అర్హులై మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా తెలుసుకోవడానికి “రచ్చబండ” అనే కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగిందన్నారు, నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయ సాధనకై గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో టెక్నికల్ పరంగా ఏవైనా ప్రాబ్లం ఉండి అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరకుండా ఉంటే వాటిని అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు, గతంలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ తిరిగే వారని, నేడు ప్రభుత్వం ప్రభుత్వమే కదలి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చూడడం అనేది విషయం కాదు అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని ఆయన కొనియాడారు, ప్రజా సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా పార్టీలను చూడకుండా, కుల మతాలను చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలియజేశారు, ఇక చెన్నూరు మండలంలో ఉన్న ఒకే ఒక కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ ఇది మూతపడి ఫ్యాక్టరీ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకొని వారికి రావలసిన  14 కోట్ల బకాయిలను చెల్లించి కార్మికులను ఆదుకోవడం జరిగిందన్నారు, అంతేకాకుండా చెన్నూరు మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు, ముస్లిం లకు షాది ఖానా నిర్మించేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ప్రభుత్వం సచివాలయ కన్వీనర్లకు, గృహ సారధులకు ప్రమాద బీమా చేయించడం జరిగిందని, వాలంటీర్లకు సంబంధించి ప్రమాదవ బీమాను నేను నా సొంత నిధులతో చేయించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, రాబోవు రోజులలో పార్టీకి కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రతిఫలం ఉంటుందని ఆయన తెలియజేశారు, నిరంతరం ప్రజలలో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకునే వ్యక్తిగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడప కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండలంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు ఎంత ఎత్తు నిధులతో ఏ ఏ పనులు చేపట్టింది సమావేశంలో చెప్పడం జరిగింది, ఇంకా కొన్ని పనులు చెప్పటాల్సి ఉందని త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు పులి సునీల్ కుమార్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, సొసైటీ అధ్యక్షులు, అల్లి శ్రీరామ్మూర్తి, జె సి ఎస్ మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, జె సి ఎస్ టౌన్ కన్వీనర్ శ్రీనివాసరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు, గృహస్థారథులు, జె సి ఎస్ కన్వీనర్లు, వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author