త్వరలో… జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
1 min read– పౌరులలో ఆరోగ్య అవగాహన కల్పించడం, వారి ఆరోగ్య అవసరాలను ప్రచార పద్ధతిలో పరిష్కరించడం..
– జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం..
– వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య
– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ మరియు అధికారులు..
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి జిల్లా : త్వరలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందుబాటులోని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య తెలిపారు.బుధవారం వెలగపూడి సచివాలయం నుండి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ పౌరులలో ఆరోగ్య అవగాహన కల్పించడం, వారి ఆరోగ్య అవసరాలను ప్రచార పద్ధతిలో పరిష్కరించడం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం అన్నారు. పౌరుల ఆరోగ్య అవసరాలను గుర్తించడానికి డోర్ టు డోర్ ప్రచారం, సంప్రదింపులు, చికిత్స మరియు రిఫరల్ కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాటు ఉంటాయన్నారు. డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా వాలంటీర్లు తమ క్లస్టర్‌లోని ఇంటింటికి వెళ్లి జేఏఎస్ కార్యక్రమం, ఏఎన్ఎం సందర్శన షెడ్యూల్‌పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి అవసరమైన పరీక్షలు నిర్వహించడం, వారి పూర్తి కేస్ షీట్లతో పాటు ఫలితాలను వైద్యుల వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాలను షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్య శిబిరంలో ప్రజలు వైద్యులను సంప్రదిస్తే రోగులను పరీక్షించి అవసరమైన మందులు సూచించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా, రోగులకు తదుపరి చికిత్స అవసరమైతే, వారిని ఉన్నత కేంద్రాలకు రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 4Dలు ఉన్న పిల్లలు, ఎన్ సి డి/సిడిలు ఉన్న వ్యక్తులను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని అన్ని గృహాలను కవర్ చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15న లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని, సెప్టెంబర్ 30 నుండి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిడిఓ, ఎంఆర్‌ఓ, పిహెచ్‌సి వైద్యాధికారులు విలేజ్ హెల్త్ క్లినికల్ లు వారీగా ఆరోగ్య శిబిరాల ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల విషయంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, యుపిహెచ్‌సిల మెడికల్ ఆఫీసర్లు యుపిహెచ్‌సి వారీగా ప్లానింగ్ చేయాలన్నారు. శిబిరం కోసం ఇద్దరు అదనపు వైద్యులు, స్పెషలిస్టులను కూడా నియమించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య శిబిరం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల ప్రాంగణంలో లేదా అనువైన ఏదైనా ఇతర భవనం, పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ పీహెచ్సీలలో ఏర్పాటుకు నిర్దేశించడం జరిగిందన్నారు. ఎంపీడీవోలు, తహాసిల్దార్ లు మండలంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లను సమానంగా విభజించి ఆరోగ్య శిబిరం బృందానికి నాయకత్వంతో పాటు, శిబిరాల ఏర్పాట్లను చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్ లు ప్రత్యామ్నాయ రోజులలో శిబిరాలు ఉండే విధంగా వారు క్యాంపులను షెడ్యూల్ చేయాలన్నారు. అర్బన్ ప్రాంతాల విషయంలో మునిసిపల్ కమీషనర్ల నేతృత్వంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. పాఠశాల పిల్లలతో పాటు రక్తహీనత ఉన్న మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలకు శిబిరానికి వచ్చేముందే స్క్రీనింగ్ నిర్వహించి చెకప్ అవసరమయ్యే కేసులను గుర్తించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సందర్భంగా కొన్ని జిల్లాల కలెక్టర్లు పలు సూచనలను, సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి. మహేశ్వరరావు, ఇన్చార్జి డి సి హెచ్ ఎస్ సూర్యనారాయణ, ఐసిడిఎస్ పిడి సుజాత రాణి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసిహెచ్ అప్పారావు, డి ఈ ఓ ఆర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.