PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తనిఖీ నిమిత్తం ఓటింగ్ యంత్రాలు తరలింపు..

1 min read

– జిల్లా ఇంచార్జీ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓటింగ్ యంత్రాలను పరిశీలన నిమిత్తం ఆయా కంపెనీలకు తరలించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవిఎం గోడౌన్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య పరిశీలించారు. అనంతరం ఇంచార్జీ జిల్లా కలెక్టర్  నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్ లోని ఈవిఎం గోడౌన్  లను పరిశీలించడం జరిగిందని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని  గోడౌన్ లో ఉన్న  ఈవీఎం యూనిట్లను 2018 సంవత్సరం కంటే ముందు సరఫరా చేయబడిన ఈవీఎం యూనిట్లు BEL కంపెనీవి పరిశీలన నిమిత్తం 2598 బాక్సులలోని 25,975 ఓటింగ్ యంత్రాలను, హైదరాబాద్ మరియు ఘజియాబాద్ లో గల BEL కంపెనీకి తరలించడం జరుగుతుందని ఈవీఎం లను స్కానింగ్ చేయడం జరుగుతుంది అని స్కానింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామని జిల్లా  ఇంఛార్జి కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ కలెక్టర్ వెంట  దేవనకొండ మండల తహశీల్దార్ వెంకటేష్ నాయక్, చిప్పగిరి మండల తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల సూపరిండెంట్ మురళి,YSRCP,TDP, BJP, పార్టీల ప్రతినిధులు ఎన్నికల సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

About Author