PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి… టి.జి భరత్

1 min read

– భగవద్గీత ద్వారా మనిషి సంతోషంగా ఎలా జీవించాలో తెలుస్తుంది..

– క్రిష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఇస్కాన్ టెంపుల్, గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఇస్కాన్ టెంపుల్ లో ఆయన క్రిష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీలప్రభుపాదుల వారికి పుష్పాంజలి సమర్పించారు. తర్వాత జగన్నాదబలదేవ సుభద్రామాయిలకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నగర శివారులోని గాయత్రీ గోశాలను సందర్శించి క్రిష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఉట్టి కొట్టారు. అనంతరం గోమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ మనిషి సంతోషంగా ఎలా బ్రతకాలో భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చన్నారు. శ్రీ క్రిష్ణుడుని ఆరాధించడంతో పాటు ప్రతి ఒక్కరూ గోమాతను కూడా దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు, గాయత్రీ గోసేవ సమితి గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్, అధ్యక్షులు జగదీష్ గుప్త, ఇల్లూరు లక్ష్మయ్య, ఇల్లూరు రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author