నిరాశ్రయులకు అన్నదానం
1 min readపల్లెవెలుగు వెబ్, కల్లూరు అర్బన్: కరోన కష్టకాలంలో నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా మైనార్టీ శాఖ అధికారి మహబూబ్బాష అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం నగరంలోని అశోక్ నగర్ పంపు ఎదురుగా వున్న నిరాశ్రయుల వసతి గృహంలోని 30 మందికి మనం– మనకోసం సేవా సభ్యులు మరియు సమాచార చట్టం, సామాజిక కార్యకర్త సలీం భోజనం ఏర్పాటు చేశారు. అన్నం, సాంబరు, గుడ్డు, మజ్జిగతోపాటు మాస్కులు కూడా అందజేశారు. DMWO మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ సేవ చేసే దృక్పథం ఆలోచన రావాలన్నారు. ఎంత ధనవంతులైనా తోటివారికి సహాయ పడకపోతే జీవితమే వ్యర్ధం అన్నారు. అనంతరం శ్రీ సలీం మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చటమే మనిషికి తృప్తి. అందుకే ఇక్కడివారికి భోజనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.