ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నాం…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ రోజు హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మీనాక్షి,కార్యదర్శి రాజశేఖర్ 6వ వార్డు మెయిన్ రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సమస్య పరిష్కరించాలని సర్పంచ్ మరియు కార్యదర్శిని విన్నపించడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ తనయుడు చలువాది పంపాపతి,కార్యదర్శి రాజశేఖర్ జేసిబి ద్వార గుంతల రహదారిని చెదును చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరనికి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రజలు వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచికోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవికాంత్,హమీద్ తదితరులు పాల్గొన్నారు.