మారుతున్న కాలానుగుణంగా- ఉపాధ్యాయులకు శిక్షణ
1 min read– సమగ్ర శిక్ష ఎ పి సి ప్రభాకర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మారుతున్న కాలానుగుణంగానే ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం అవుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి తెలిపారు,పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే తీరులో కూడా మార్పు వస్తోందన్నారు, గురువారం చెన్నూరు గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆరు రోజులపాటు జరిగే ప్రకాశం,కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన జిల్లా రిసోర్స్ పర్సన్ లకు ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమo జరుగుతోంది, నాలుగవ రోజు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ పి సి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటే సత్పలితాలను ఇస్తుందన్నారు. ఆరోగ్యం పట్ల, ఆహారపు అలవాట్ల పట్ల తగిన శ్రద్ద వహించాలన్నారు. అప్పుడే పాఠశాలల్లో విద్యార్థులకు కూడా మంచి బోధన లభిస్తుందన్నారు.విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, సమాజానికి అందిస్తే దేశానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడినవారం అవుతామన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తప్పనిసరిగా పాఠశాలల్లో నేర్పించాలన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు, ట్రైనింగ్ ఇంఛార్జి పెంచలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో సరైన విద్యాభ్యాసం అందాలన్నారు. పునాది లేనిదే ఏదీ సాధ్యపడదని తెలిపారు,ఎ పి సి ప్రభాకర్ రెడ్డి సూచనలు పాటించాలన్నారు, ఎ ఎం ఓ ధనలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో గ్రేడ్ –1,2 టీచర్స్ కోసం 60రోజుల ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్య్రమాలను డి ఆర్ పి లకు ఇస్తున్నట్లు తెలిపారు, కడప లో ప్రస్తుతం రెండవ విడత శిక్షణ జరుగుతోందన్నారు, ప్లానింగ్ &ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ పి. లక్ష్మి నరసింహ రాజు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యను పటిష్టం చేయడానికి ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ ను grade-1, 2స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా రెసిడెన్షియల్ స్థాయిలోనే ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు,ఈ సమావేశం లో జి సి డి ఓ విజయలక్ష్మి, ప్రకాశం జిల్లా సమగ్రశిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్, ఎ ఎ ఎం ఓ రామంజులు రెడ్డి,కే.ఆర్.పి.లు,సమగ్ర శిక్ష సిబ్బంది, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.