PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వివిధ ఆలయాలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు, మండలంలోని కొండపేట లోని ఇస్కాన్ టెంపుల్ లో, అలాగే చెన్నూరు లోని శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రంలో, మండలంలోని రామనపల్లి లో గల రామాలయం లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు, ఉదయం 4: 30 నుండి సుప్రభాత సేవ, మంగళ హారతి, 8 నుండి 9 గంటల వరకు శంకాభిషేకం, పుష్పాభిషేకం , విశేష అలంకరణ, వివిధ భజన బృందాలచే శ్రీకృష్ణ భజన, గోపూజ, గావించారు, తదుపరి భజన భజనలు, కీర్తనలు ఊంజల సేవ, పవళింపు సేవ తో పాటు ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారురామనపల్లెలోని పురోహితులు వెంకటేశ్వర్ల శర్మ నేతృత్వంలో రాధాకృష్ణుల కళ్యాణం నిర్వహించారు, కళ్యాణం చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది,మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ తోపాటు గ్రామస్తులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సాయంత్రం రాధాకృష్ణుల గ్రామోత్సవం నిర్వహించారు,

 

About Author