అర్హత ఉంటే ఇంటివద్దకే పథకాలు
1 min read– గడివేముల గడప గడపకు మనప్రభుత్వ కార్యక్రమం..ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలగు వెబ్ గడివేముల: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. గురువారం గడివేముల గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి లబ్ధిదారులకు బుక్ లేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదప్రజల అభ్యున్నతి కోసం వినూత్నమైన సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల సారధిగా సీఎం ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లంచాలకు, వివక్షకు తావులేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో జెడ్పీటీసీ ఆర్.బీ చంద్రశేఖరరెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ శివ మల్లేశ్వరప్ప,ఉప సర్పంచ్ బాలచెన్నీ, వైఎస్సార్ సీపీ నాయకులు దేశం నాగేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, రమేష్, రవీంద్రారెడ్డి, సచివాలయం సిబ్బంది, వలంటీర్ లు పాల్గొన్నారు.