ఎఐఎస్ఎఫ్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం
1 min readAISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా AISF మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి సాయిఈశ్వరి అల్లంబి మాట్లాడుతూ._* స్థానిక హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు తెలుగు.హిందీ. ఉపాధ్యాయులను ఇంటర్ విద్యార్థులకు తెలుగు.బాటని అధ్యాపకులను నియమించి విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడుతూ భోజనాలు గురించి విద్యార్థులను అడగగా మేము ప్రకారంగా భోజనం అందిస్తున్నారని విద్యార్థులు తెలియజేశారు. అదేవిధంగా గతంలో విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించేవారు.కానీ వాటికి బదులుగా ఒక విద్య సంవత్సరానికి రెండుసార్లు విద్యార్థులకు కిట్లు అందజేస్తుంది.కానీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఇంతవరకు కిట్లు అందలేదు. ఇప్పటికైనా విద్య అధికారులు స్పందించి విద్యార్థులకు కిట్లు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ AISF సహాయ కార్యదర్శులు హనుమంతు భీమేష్ AISF ఉపాధ్యక్షులు రాజేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.