తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం..!
1 min read• సుంకేసుల – కర్నూలుకు రూ.82 కోట్లతో పైపులైన్
• జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
• వెల్లడించిన నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని నగర మేయర్ బీవై రామయ్య వెల్లడించారు. సుంకేసుల నుంచి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు 23 కి.మీ. పైపులైన్ వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను రూ.82 కోట్లు విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 14.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.62.02 కోట్లు అమృత్ స్కిం ద్వారా విడుదల చేయగా, మిగతా రూ.62.02 కోట్లు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రూపాల్లో ఖర్చు చేయనుంది.
సోమవారం కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ బి.వై రామయ్య, కమిషనర్ డి.కే బాలాజీ మాట్లాడారు. కర్నూలు న్యాయరాజధానిగా త్వరలో రూపుదిద్దుకుంటుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి కర్నూలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు తరలి రానుందన్నారు.ప్రస్తుతం సుంకేసుల నుండి కేసి కెనాల్ ద్వారా తీసుకొస్తున్నప్పుడు 40 నుంచి 60 శాతం నీరు పక్కదారి పడుతుందన్నారు.