PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జడ్పీహెచ్ పాఠశాలలో జి 20 నేషన్స్ మాక్ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్  వెలుగోడు: వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో జి20 నేషన్స్ మాక్ సమావేశాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు.  10వ తరగతి విద్యార్థులు వివిధ దేశాల జాతీయ పతాకాలను స్వయంగా తయారు చేసి జి 20 దేశాల అధ్యక్షుల  పేర్లతో ఆసీనులై వారి వారి దేశాల అభివృద్ధి కోసం జి20 దేశాలతో కలిసి ఏ విధంగా పనిచేయాలో అన్న విషయాలన్నింటినీ వారు విద్యార్థిని విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. సామాన్యునికి అర్థమయ్యే విధంగా జి20 దేశాల సమావేశ ఇతివృత్తాన్ని కళ్ళకు కట్టినట్లుగా పాఠశాల విద్యార్థులు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు వివిధ దేశాల అధ్యక్షుల స్థానాలలో అసీనులై ద్వైపాక్షిక ఒప్పందాలు, చంద్రయాన్ 3 విజయవంత విషయాలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా మొదలగు విషయాలపై దేశం సాధించిన ప్రగతిని వివరించి భారత్ జిడిపి గురించి విద్యార్థులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సత్యనారాయణ రావు  అధ్యక్షత వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని సైన్సు ఉపాధ్యాయులు వెంకట సుబ్బయ్య   చొరవ చూపి విద్యార్థులను చక్కగా ప్రిపేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు  రవిశంకర్ రావు , మొయినుద్దీన్ ,  ఫైజుల్ల సురేంద్ర సింగ్ ,నరసింహులు , విశాలాక్షి ,  హైమావతి ,  పాపన్న ,  అహ్మద్ హుస్సేన్ ,  సౌభాగ్యమ్మ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమును చక్కగా నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు బహుమతులు ప్రధానం చేశారు.

About Author