NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మన ఓట్లు మనకే వేసుకుందాం

1 min read

* బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం

* బహుజనులను గుర్తించని పార్టీల జెండాలు మోయొద్దండి : జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ

* పెద్ద సంఖ్యలో బీఎస్పీలో చేరిన యువకులు

పల్లెవెలుగు వెబ్ ఉరవకొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం, గుర్తింపు ఇతర ఏ పార్టీలో కూడా ఉండదని బహుజన సమాజ్ పార్టీలో మాత్రమే ఇది సాధ్యమనే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం పేర్కొన్నారు. ఉరవకొండ పట్టణంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష  సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజ్యాధికారం తగ్గాలంటే మన ఓట్లు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులకు వేసుకున్నప్పుడే సాధ్యమని ఆయన అన్నారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గడపగడపకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బహుజనులకు ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వని పార్టీల జెండాలు మోయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా బహుజన సమాజ్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.  అనంతరం యువకుడు విద్యావంతుడు మేధావి ఉత్సాహవంతుడు రాము బహుజన సమాజ్ పార్టీలో చేరారు. రాముని ఉరవకొండ మండల అధ్యక్షుడుగా జిల్లా అధ్యక్షుడు నాగభూషణం ప్రకటించారు. రాము పార్టీలో చేరుతున్న సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వివిధ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బహుజన సమాజ్ పార్టీలో చేరారు.

About Author