PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడల్లో పాల్గొంటే చదువులోనూ రాణిస్తారు…

1 min read

– విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో సాధన అవసరం

– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ వెల్లడి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి చదువులో రాణించాలంటే క్రీడల్లో సాధన ఎంతో అవసరమని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూలు నగరంలోని వన్ టౌన్ లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో టైక్వాండో సాధన చేస్తున్న విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ తో పాటు శిక్షణ ఇస్తున్న శిక్షకులకు ట్రాక్ షూ లను డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే చదువులో వెనుక పెడతారని అపోహ తల్లిదండ్రుల్లో చాలామంది లో ఉందని, కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదని అన్నారు.విద్యార్థులు క్రీడల్లో సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని ఆయన వివరించారు .విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కావడం వల్ల తోపాటు సెల్ ఫోన్లు వంటి వాటికి పూర్తిస్థాయి సమయం కేటాయించడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఊబకాయం వల్ల బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమై విద్యార్థులు చదువులో వెనుకబడి పోయే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీ ద్వారా ప్రపంచంలోనే భారతదేశాన్ని అంతరిక్ష పరిశోధనలో అగ్రగామి దేశంగా నిలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్నూలు నగరానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి కర్నూలుకు పేరు తీసుకురావడం అభినందనీయమని చెప్పారు.అన్ని రంగాలలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జీ 20 దేశాల సదస్సు ఇందుకు నిదర్శనం అని వివరించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తాను నిరంతరం సహకారం అందిస్తానని వివరించారు.విద్యార్థులు తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఆత్మ రక్షణతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ పెరిగి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని  డాక్టర్ శంకర శర్మ సలహా ఇచ్చారు.

About Author