పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
1 min read– పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సిఎం జగన్ …
– నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: పేదల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. నందికొట్కూరు పురపాలక పరిధిలోని హౌసింగ్ లే అవుట్ యందు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే గృహ నిర్మాణాలకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పూరిగుడిసె లేకుండా చేశారని, తండ్రి స్పూర్తితో సీఎం జగన్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.
ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి సగటున కనీసం రూ 2 లక్షలకు పైగా చేస్తోందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ 1.80 లక్షలు, ఇంటి మౌలిక వసతుల కోసం రూ 1.50 లక్షలును అందిస్తున్నారన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మకు కనీస లబ్ది రూ 5 లక్షల నుండి రూ 10 లక్షల వరకు అందే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అర్హత ఉండీ, పొరపాటున ఇళ్ళు మంజూరు కానివారు గ్రామ/ వార్డ్ సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, గృహ నిర్మాణ సంస్థ ఈ.ఈ , నందికొట్కూరు ఇంచార్జ్ తహసిల్దార్ , మునిసిపల్ కమిషనర్ గారు, గృహ నిర్మాణ సంస్థ డి.ఈ గారు, ఏ.ఈ , కౌన్సిలర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.