PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన 48 వ రాష్ట్ర స్థాయి యోగాసనా పోటీలు

1 min read

– ఓవరాల్ ఛాంపియన్గా విశాఖపట్నం జట్టు,రెండవ స్థానంలో కర్నూలు జట్టు, మూడవ స్థానంలో కృష్ణ జట్టు నిలిచాయి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ యోగ అసోసియేషన్ కర్నూలు జిల్లా సంయుక్తా ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జరిగిన 48వ రాష్ట్ర స్థాయి యోగాసనా పోటీలు ముగిశాయి. పోటీల ఓవరాల్ ఛాంపియన్ గా విశాఖపట్నం జిల్లా 67 పాయింట్స్ తో నిలువగా, రెండవ స్థానంలో (రన్నర్ ఆఫ్ ఛాంపియన్ గా ) కర్నూలు జిల్లా జట్టు, మూడో స్థానంలో 52 పాయింట్లు కృష్ణా జిల్లా జట్టు నిలిచాయని రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, 41 వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి,స్పోర్ట్స్ మాజీ డైరెక్టర్ రవీంద్రనాథ్, వెంకటేశ్వర రైస్ మిల్ ఓనర్ భాస్కర్ రెడ్డి,ముఖ్య అతిథిలుగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ  ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని పోటీల్లో రాణించాలని అన్నారు. స్నేహభావాన్ని అలవర్చుకొని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని రానున్న పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ సబ్ జూనియర్స్ జూనియర్ బాల, బాలికలు నవంబర్ 23 నుంచి 26 వరకు అస్సాం రాష్ట్రం గౌహతిలో జరగబోయే 48వ జాతీయ స్థాయి యోగాసనా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అన్నారు.రాష్ట్ర యోగ సంఘం సభ్యులు మురళీకృష్ణ,వెంకట్, చంద్రశేఖర్, డాక్టర్ రామారావు లు పాల్గొన్నారు.

About Author