అదనపు ఆదాయంతో మరింత అభివృద్ధి
1 min read• నగర పాలక సంస్థ తొలి పెట్రోల్ పంపు అట్టహాసంగా ప్రారంభం
• మేయర్, ఎమ్మెల్యేలు, కమిషనర్, కార్పొరేటర్లు హాజరు
• మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడి
నగర పాలక సంస్థ;
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూలు నగర పాలక సంస్థ శ్రీకారం చుడుతున్న వివిధ రకాల ఆదాయ మార్గాలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దోహదపడతాయని నగర హాఫిజ్ ఖాన్ అన్నారు. కొండారెడ్డి బురుజు సమీపంలో ఇండియన్ ఆయిల్ సంస్థతో కలిసి కర్నూలు నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ పంపును సోమవారం ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ , కాటసాని రాంభూపాల్ రెడ్డి , మేయర్ బి.వై రామయ్యా కమిషనర్ ఏ.భార్గవ్ తేజ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ,మేయర్ మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృథా చేయకుండా వాటినే పెట్టుబడిగా పెట్టి సంస్థకు మరింత ఆదాయం సమకూర్చే విధంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఆలోచన రాష్ట్రంలోనే ఏ కార్పొరేషన్ చేయలేదన్నారు. దీనినే స్పూర్తిగా తీసుకొని మరో పెట్రోల్ పంపు ప్రారంభిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ‘ఎక్కడా నిధులు కేటాయిస్తే తమ ఖాతలోకి వస్తాయే అక్కడే నిధులు కేటాయించేవారని’ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ , కాటసాని మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో మున్సిపాలిటీలను తమ పార్టీ స్థానిక నాయకులకు ఆదాయ మార్గంగా చూసేవారని, తద్వారా నగరాలు, పట్టణాలు అధ్వాన్నంగా ఉండేవని మండిపడ్డారు. వాటికి భిన్నంగా వైయస్ జగన్ ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలకు నాంది పలకగా, జాతీయ స్థాయిలో అవార్డులు, రాష్ట్రంలో కార్పొరేషన్ల మధ్య పోటాపోటీ నెలకొందన్నారు. ఫలితంగా నగరాలు, పట్టణాలు ప్రగతి బాట పట్టాయని, జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నాయని కొనియాడారు. కమిషనర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చేకునేందుకు మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ పంపు ఏర్పాటు ద్వారా ఆదాయంతో పాటు సంస్థకు చెందిన వాహనాలకు కమిషన్ లేకుండానే పెట్రోల్, డీజిల్ లభిస్తుందన్నారు. పెట్రోల్ పంపు నందు 14 మంది సిబ్బందిని ఉంచామని, 4 డియూలు, నగదు రహిత లావాదేవీల ఏర్పాటు చేశామన్నారు. 20,000 వేల లీటర్లు సామర్థ్యంతో నిరంతరాయంగా పంపు కొనసాగుతోందని తెలిపారు. పెట్రోల్ పంపు ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్ కర్నూలే అన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షరాలు సిట్ర సత్యనారాయణమ్మ , కార్పొరేటర్లు షాషావలి , అర్షియా ఫర్హిన్ , జుబేర్ అహ్మద్ ,కైప పద్మలత రెడ్డి ,గాజుల శ్వేతరెడ్డి ,నారయణ రెడ్డి , శ్రీనివాసరావు , కో-ఆప్షన్ మెంబర్ నయీమ్ పాషా ,కో-అప్షన్ మెంబర్ కృష్ణమూర్తి ,మహేష్ , గడ్డం రామకృష్ణ ,అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ , మేనేజర్ చిన్నరాముడు , రెవెన్యూ ఆఫీసర్ జునైద్ , అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్ , ఎం.ఈ.లు శేషసాయి , షాకీర్ , శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు , ఆర్ఐ సుహైల్ తదితరులు పాల్గొన్నారు.