PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ  ఆత్మహత్యల  నివారణ దినోత్సవం 

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: సమాజంలో, కుటుంబంలో, ఆర్థికంగా అనారోగ్యంతో ఎదురయ్యే అనేక సమస్యలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 7 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్, అధినేత డాక్టర్ అయోధ్య ఆర్. కె. అన్నారు.స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్బులో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక పరిస్థితిని విశ్లేషించి చికిత్స చేస్తే నివారణ సాధ్యం “వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే” సదస్సులో డాక్టర్ అయోధ్య ఆర్. కె & డాక్టర్ మానస. .కె అభిప్రాయం తెలియజేశారు.  ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుంది అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్యలో స్త్రీల కంటే పురుషుల్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడే వారిలో రైతులు, మరియు టీనేజర్స్, వృద్ధులే, ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించి నివారణకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజే శారు .అలాగే సూసైడ్ డేంజర్ సిగ్నల్స్, గమనిస్తే కౌన్సిలింగ్ ,మందులు, ద్వారా వ్యక్తి ఆలోచనలు మార్పు తీసుకురావచ్చు అని చెప్పారు ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉంటాయని వివరించారు తదనానంతరం డాక్టర్ మానస.కే మాట్లాడుతూ ఆత్మహత్యలను నివారించాలంటే ముందుగా ఆత్మహత్యల వైపు ఆలోచన చేసే వ్యక్తుల్ని గుర్తించడం అవసరమన్నారు. గుర్తించాలన్నారు అకస్మాత్తుగా డల్లగా అయిపోవడం వృధా శీన ప్రవర్తన ,జీవితం భారమైనట్లు మాట్లాడటం, చావడం మేలురా అన్నట్టు, ఇతరులతో చెప్పడం, చనిపోవడానికి సాధనాలు సమకూర్చుకోవడం మానసిక గది లో దిగాలిగా ఒంటరిగా ఉండడం, రోధించడం, ఇతరులతో కలిసి మెలిసి ఉండకపోవడం వంటి వార్నింగ్ సిగ్నల్స్ గుర్తించి అలాంటి వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

 

About Author