కర్నూల్ ఐటీడీపీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నిర్బంధం
1 min readపల్లెవెలగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు ని ఖండిస్తూ ఈరొజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఐటీడీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు గట్టు తిలక్ గారి ఆధ్వరంలో ఐటీడీపీ సభ్యులు , పార్టీ నేతలతో 44.వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి దాదాపు గంట పైన వాహనాలను నిలిపివేసి రోడ్డు పైన టైర్లకు నిప్పటించి రోడ్ పైన బయటాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ఎన్నో కేసుల్లో ఎ1 గా ఉన్న ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి విచ్చల విడిగా విదేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు అని ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి చేసిన ఒక గొప్ప నాయకుడైన నారా చంద్ర బాబు నాయుడు గారిని చెయ్యని తప్పుకు కక్షపూరితంగా రిమాండ్ కు పంపించడం చాలా దారుణమైన విషయం అని రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా గోరమైన రోజు మరొకటి ఉండదు అని తిలక్ గట్టు ధ్వజమెత్తారు .రాష్ట్ర ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వైసీపీ ప్రభుత్వం అక్రమ చర్యలు అర్థం అవుతున్నయి అని ఆయన తెలియచేసారు, నిరసన చేపడుతున్న సమయంలో స్థానిక నాల్గొవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి నాల్గొవ పట్టణ స్టేషన్ కి తరలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ జిలా అధ్యక్షులు తిలక్ గట్టు , ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు మంద అఖిల్, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆనంద్ , బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రాజు యాదవ్ , సంజీవ లక్ష్మి , ఎస్సి సెల్ నాయకులు ఏసన్న , బజారన్న , రాజశేఖర్ రెడ్డి,మరియు ఐటీడీపీ కర్నూల్ సభ్యులు రఫీక్ , మురళి , అజయ్ , హేమకాంత్ , మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు