టిడిపి సీనియర్ నేత ఆధ్వర్యంలో 3వరోజు కొనసాగిన నిరసనలు
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేటలో మూడో రోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి సీనియర్ నేత ప్రముఖ విద్యావేత్త జగన్ రాజు గారి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద రాజంపేట రాయచోటి రోడ్డు మార్గంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొని అక్రమ అరెస్టు నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులను బలవంతంగా వాహణాల్లోకి ఎక్కించి పట్టణ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అతనిపై ఉన్న కేసులు రీత్యా ఇతరులను కూడా కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే అక్రమంగా చంద్రబాబు నాయుడు పై కేసులు పెట్టించి అరెస్టు చేసే విధంగా చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని రాబోవు కాలంలో ప్రజలు కూడా ఇలాంటివారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జగన్ రాజు గారితో పాటు రాష్ట్ర మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్యను. జీవీ సుబ్బరాజు. వినోద్ రెడ్డి. శేషారెడ్డి. సుధాకర్ రాజు. నాగేంద్ర. వెంకటేష్. హరి. విజయ్. బాల. వారితో పాటు కొంతమంది యువతను కార్యకర్తలను అరెస్టు చేసి సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచి విడుదల చేయడం జరిగినది.