పదోన్నతిపై విస్తరణ అధికారులు..
1 min read– అధికారుల సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి..
– డిపిఓ తూతిక శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి కమీషనర్ సూర్యకుమారి ఆదేశాలు మేరకు జిల్లాకు 09 మంది విస్తరణ అధికారులను పదోన్నతిపై కేటాయించడం జరిగింది. కాగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విస్తరణ అధికారులకు జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాలు కేటాయించి ఉత్తర్వులు జరిచేశారు. సందర్బంగా జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ అగ్రిపల్లి మండలానికి సీ. హెచ్. శేఖర్, చాటరాయికి మురళీకృష్ణ, భీమడోలుకి సుందరి, కలిదిండికి రాజారావు, ముదినేపల్లికి లక్ష్మీనారాయణ, కామవరపుకోటకి మరిడయ్య, కుక్కునూరుకి శివ నాగ నరసింహరావు కేటాయించారని, ఇంకా ఇద్దరు విస్తరణ అధికారులు జిల్లాకి రిపోర్ట్ చేయవలిసి ఉందని అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాలకు విస్తరణ అధికారులను ప్రభుత్వం భర్తీ చేసిందని దీనివలన గ్రామాలలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రగతి ఉంటుందని. అధికారులు సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డిపివో తూతిక శ్రీనివాస్ అన్నారు.