ఎస్ఐ అభ్యర్ధుల దేహదారుఢ్య పరీక్షలు
1 min read
– ఎస్సై మెయిన్స్ పరీక్షకు ఈ రోజు 443 మంది ఎంపిక.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో 14 వ రోజు దేహదారుడ్య పరీక్షలు జరిగాయి.ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి . కృష్ణ కాంత్ ఐపియస్ , అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ , సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ పర్యవేక్షించారు. ఈ రోజు 800 మంది అభ్యర్దులకు గాను 623 మంది అభ్యర్దులు హజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.1600 మీటర్ల పరుగు పరీక్షలో 583 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 511 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.100 మీటర్ల పరుగు పరీక్షలో 511 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 388 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.లాంగ్ జంప్ లో 511 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.422 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సై మెయిన్స్ పరీక్షకు ఈ రోజు 443 మంది అర్హత సాధించారు.