PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ వేసుకుంటే.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్రక‌టించిన బ్యాంకులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు కొత్త ఆఫ‌ర్లు తీసుకొస్తున్నాయి. వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డం ద్వార క‌రోన క‌ట్టడి చేయాల‌న్న ల‌క్ష్యంలో బ్యాంకులు భాగం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడ వ్యాక్సినేష‌న్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రోత్సాహ‌కాలు ప్రక‌టించాయి. వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద అధిక వ‌డ్డీ ఇస్తామ‌ని ఈ రెండు బ్యాంకులు ప్రక‌టించాయి. ఒక్క డోసు వేసుకున్నా స‌రే.. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇప్పుడున్న వ‌డ్డీ రేట్ల కంటే 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) అధికంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని యూకో బ్యాంక్ ప్రక‌టించింది. అయితే ఈ ఆఫ‌ర్ సెప్టంబ‌ర్ వ‌రకు మాత్రమే చెల్లుబాట‌వుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కాల‌వ్యవ‌ధి 999 రోజులు మాత్రమే.

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెల‌లో వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ప్రత్యేక ప‌థ‌కం ప్రవేశ‌పెట్టింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ ద్వార ఎవ‌రైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికి 25 బేసిస్ పాయింట్లు అధ‌నంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని ప్రక‌టించింది. ఈ ఫిక్డ్స్ డిపాజిట్ కాల‌వ్యవ‌ధి 1,111 రోజులు. సీనియ‌ర్ సిటిజ‌న్లకైతే మ‌రో 25 బేసిస్ పాయింట్లు అద‌నంగా క‌లిపి .. మొత్తం 50 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ చెల్లించ‌నుంది.

About Author