వాల్మీకి మేలుకొలుపు యాత్ర…
1 min readయాత్ర చేపట్టిన క్రాంతి నాయుడు కు ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: 2022 జూన్ లో APVBS (ఆంధ్ర ప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం) ఆధ్వర్యంలో మంత్రాలయం నుండి అమరావతి వరకు చేపట్టిన “వాల్మీకి మేలుకొలుపు యాత్ర” అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను కలుపుకుంటూ సాగిందని, ఈ యాత్రలో వాల్మీకి బోయలు ఎదుర్కున్న సమస్యలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ 3800 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. వెనుకబడిన కులాల కోసం హేపట్టిన యాత్ర ప్రాధాన్యతను గుర్తిస్తూ ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు రికార్డ్ సర్టిఫికేట్ ప్రధానం చేశారని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా హనరరీ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారని ఆయన తెలిపారు.