PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రారంభోత్సవ వివాదం..?

1 min read

*సొంత నిర్ణయం తీసుకుంటున్న ఆలయ ఈవో

*చైర్మన్ చక్రపాణి రెడ్డి   ప్రారంభోత్సవం వాయిదా వేయాలని మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ కు లేఖలు  

*శ్రావణమాసం లో ప్రారంభోత్సవం చేయకుండా  ఇప్పుడు చేయటానికి అంతర్యం ఏమిటి?

పల్లెవెలుగు: శ్రీశైలం క్షేత్రంలోఆచారాలు..సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయి. గతంలో కుంభాభిషేకం వాయిదా పడటం తాజాగా శ్రీశైలం క్షేత్రంలో ఈవో లవన్న మరో వివాదంలో చిక్కుకున్నాడు . శ్రీశైలంలో 220 వసతి గదుల గణేష్ సదన్ మరియు పంచమటాల జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమాలను ప్రారంభించాలని ముహూర్తం పెట్టారు. భక్తుల నుండి విమర్శలు వెళ్లి విరుస్తున్నాయి. శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం,  ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు పురాణాలు చెబుతున్నది.  భక్తితో నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇప్పుడు వివాదంగా మారాయి.  సుదీర్ఘ కాలంగా వస్తున్న సంప్రదాయం కాదని.. తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆలయ ఈవో లవన్న శూన్య మాసంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 9 .50 నిమిషాలకి గణేష్ సదన్ ప్రారంభించాలని ముహూర్తం పెట్టారు. భాద్రపద మాసం ముహూర్తం సరైనది కాదని మంచి రోజులు లేకపోవడంతో గణేష్ సదన్ ప్రారంభోత్సవాన్ని వాయిదా  వేయాలని శ్రీశైలం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి   ప్రారంభోత్సవం వాయిదా వేయాలని దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ కు లేఖలు రాశాడు. లవన్నకు శిక్ష విధించిన న్యాయస్థానం, శిక్ష పడిన అధికారి ఏ  విధంగా ప్రారంభోత్సవాలు చేస్తారని ధర్మకర్తల మండలి సభ్యుల ఆగ్రహం, eo లవన్నతనకు ఇష్టం వచ్చినట్లు ప్రారంభోత్సవ తేదీనిమారుస్తున్నాడు మొదట 20వ తారీకు అని చెప్పి మరల 19వ తారీకు ప్రారంభోత్సవం సర్కులర్ పాస్ చేస్తున్నాడు. ఈవో లవన్నకు గుంతకల్ ఆర్డీవో గా బదిలీ వచ్చిన ఇక్కడి నుండి వెళ్లకపోవడం రాజకీయ అండదండల కారణమా భక్తులు స్థానికులు వాపోతున్నారు. దేవాదాయ శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.

About Author