రాష్ట్ర ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం..
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు: మంగళవారం ఉదయం తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉదయం 10.10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, డిఐజి సెంథిల్ కుమార్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్, కోడుమూరు శాసనసభ్యులు డా .సుధాకర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తదితరులు స్వాగతం పలికారు.
తిరుగు ప్రయాణం:
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల వ్యయంతో ఆలంకొండ వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఆలంకొండ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు మధ్యాహ్నం 2.23 గంటలకు చేరుకున్నారు, అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, డిఐజి సెంథిల్ కుమార్, నగర మేయర్ బివై.రామయ్య,జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అధికారులు కలిసి ఘన వీడ్కోలు పలికారు.