అంబులెన్స్ లో… గర్భిణీ ప్రసవం…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : అంబులెన్స్ వాహనంలో గర్భిణీ ప్రసవించింది హోళగుంద మండలంలోని ముద్దటమగి గ్రామం చెందిన కురువ శకుంతల పురిటినొప్పులు రావడంతో ముద్దటమాగి గ్రామం చెందిన ఆశ కార్యకర్త యమున 108 కి సిబ్బందికి సమాచారం ఇచ్చింది వెంటనే emt బి. కె. యల్లయ్య,,పైలెట్ S.అసిఫ్ అలీ ముద్దటమగి గ్రామం కు వాహనం ను తీసుకొని వెళ్లి గర్భిణీ ని హోలాగుంద PHC హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే సమయం తెల్లవారు జామున 05:42నిముషాలు కు మూస క్యాంప్ గ్రామం మార్గ మధ్యలో నే మగ బిడ్డ కి జన్మనిచ్చింది. అనంతరంతల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు ఈ మహిళ కి ఇది మూడవది కాన్పు, వీరిని హోలగుందా PHC హాస్పిటల్ లో అడ్మిట్ చేశామని 108లో విధులు నిర్వహిస్తున్న EMT బి. కె. యల్లయ్య తెలిపారు.గర్భిణీ బంధువులు సమాచారం తెలుసుకున్న వెంటనే హోలగుంధా హాస్పిటల్ లో యల్లయ్య కు కృతజ్ఞతలు చెప్పినారు. EMT యల్లయ్య వారితో డెలివరీ సమయం లో బిడ్డ పేగు మెడ వేసుకొని వచ్చింది అని, తల్లి, బిడ్డ ను క్షేమంగా కాపాడి, వారి ఆరోగ్యం క్షేమంగా ఉండడం చాలా సంతోషం గా ఉంది అని 108 లో డెలివరీ చేయడం ఇది 24వ సారి అని EMT బి. కె. యల్లయ్య తెలిపారు.