మొదలైన రేమట గ్రామ రోడ్డు నిర్మాణ పనులు…
1 min read– అధికారులకు,ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు:రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి ఎట్టకేలకు రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి రోడ్డు నిర్మాణం కోసం మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి రహదారి మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి అంబులెన్సులు సైతం గ్రామంలోనికి రాని పరిస్థితి ఉండేదని,రేమట గ్రామానికి రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటమే గాక అనారోగ్యాలకు గురైన సందర్భాలు ప్రమాదాలు జరిగి గాయాలపాలై సందర్భాలు ఉన్నాయని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని దశలవారీగా ఉద్యమాలను చేసిందని అందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్,జిల్లా కలెక్టర్ సృజన,ఆర్ అండ్ బి అధికారులు నాగరాజు,సురేష్ బాబు లను అనేకసార్లు కలిసి విన్నవించామని అన్నారు స్పందించిన అధికారులు,ప్రజాప్రతినిధులు రేమట గ్రామానికి నేడు రోడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషదాయకమని అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు,రోడ్డు నిర్మాణం కోసం పనిచేసిన గ్రామ పెద్దలకు,గ్రామ ప్రజలకు,పార్టీలకు,ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,కిరణ్,వసంత్ కుమార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.