గైనిక్ విభాగాధిపతి డా.మాణిక్యరావుకి సన్మానం
1 min read– ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.వి.వెంకట రంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో గైనిక్ విభాగంపు హెచ్ ఓడీగా పని చేస్తున్న డాక్టర్ ఎస్.మాణిక్యరావు కి అడిషనల్ & డీఎంఈ పదోన్నతి లభించింది ఆయన్ను ఈరోజు గైనిక్ విభాగంలో ఘనంగా సన్మానించి శాలువా మరియు పూలమాలతో ఘనంగా పలువురు వైద్యులు మరియు ఇతర సిబ్బందితో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో డాక్టర్ మాణిక్యరావు సేవలను కొనియాడారు. ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో రౌండ్స్ నిర్వహించి అనంతరం అక్కడ ఉన్న గైనిక్ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు అనంతరం వారి సూచనలకు సానుకూలంగా స్పందిస్తూ గైనిక్ విభాగంలో అత్యవసర పరికరాలు మరియు ఏసి మరమ్మత్తులకై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనళిని, ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగంజన్, డా.కిరణ్ కుమార్, గైనిక్ విభాగపు వైద్యులు, డా.వెంకటరమణ, డా.రామ్ శివ నాయక్, డా.సావిత్రి, డా.శ్రీ లక్ష్మి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి, తెలిపారు.