విలేజ్ సర్వేయర్లతో రీ సర్వే అంశం పై జిల్లా కలెక్టర్ సమీక్ష
1 min read– రీ సర్వే కు సంబంధించి మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
– పెండింగ్ లో ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను శనివారం నాటికి పూర్తి చేయండి
– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రీ సర్వే కు సంబంధించి మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను శనివారం నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల తహశీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో రీ సర్వే అంశం పై జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి విడతలో 60 గ్రామాలకు రీసర్వే చేశామని, రెండవ విడతలో 18 గ్రామాలు రీసర్వే చేశామని తెలిపారు. ఇప్పుడు మూడవ విడత కింద 160 గ్రామాలు రీసర్వే చేయాలని లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందన్నారు.. ప్రణాళికా బద్ధంగా పని చేసి ఈ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ప్రతి రోజు మండల స్థాయి సిబ్బంది అందరూ ఫీల్డ్ లో ఉన్నారా లేదా అని పరిశీలించడంతో పాటు ఒకవేళ ఎవరైనా సెలవులో ఉంటే వెంటనే ఇంచార్జిలను నియమించి పనులను పూర్తి చేసేలా చూడాలని కె.ఆర్.సి.సి డిప్యూటీ కలెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు… గ్రౌండ్ ట్రూతింగ్ కి సంబంధించి రోజువారీ లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతుందని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే చర్యలు తప్పవన్నారు. పెండింగ్ లో ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ కూడా శనివారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సమయం లోనే కరెక్షన్స్, మ్యుటేషన్స్ పనులు పూర్తి చేసుకోవాలన్నారు…జాయింట్ కలెక్టర్ లాగిన్ లో ఎక్కువ శాతం మార్పులు, చేర్పులకు సవరణ చేయాల్సి వస్తే విఆర్ఓ, విలేజ్ సెక్రెటరీ ల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు రీ సర్వే పనులకు సంబంధించి సాధించిన పురోగతి తీవ్ర అసంతృప్తి కలిగించిందన్నారు.. అందుకే ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నిర్దేశించిన గడువు లోపు అన్ని మండలాల్లో ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేయాలన్నారు.. సమావేశానికి హాజరు కాని నందవరం విఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రీ సర్వే ప్రక్రియ పురోగతిపై మండలాల వారీగా సమీక్షిస్తూ, పెండింగ్ లో ఉన్న భూహక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.. గ్రౌండ్ ట్రూతింగ్ కి సంబంధించి ఒక రోవర్ కి ఒక టీమ్ ఉంటే 100 ఎకరాలు, అదే 2 టీమ్స్ ఉంటే 160 ఎకరాలు చేయాలని నిర్దేశించారు..రెండు రోవర్ లు ఉంటే 200 ఎకరాలు చేయాలని చెప్పడం జరిగిందని కానీ ఎవరూ కూడా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం లేదని, ఇప్పటినుండి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ పని పూర్తి కాగానే మూడు రోజులలో ఎల్పిఎమ్ జెనరేట్ చేయాలని సంబంధిత సర్వే అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అసైన్మెంట్ రివ్యూ కమిటీ కొత్తగా గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ నందు అప్లోడ్ చేయడం లో తక్కువ పురోగతి సాధించారని, పెండింగ్ లో ఉన్న లబ్దిదారుల వివరాలను త్వరితగతిన అప్లోడ్ చేయాలన్నారు.సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ మధుసూధన్ రావు, కె.ఆర్.సి.సి డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మి, సర్వే ఏడి విజయ సారథి తదితరులు పాల్గొన్నారు.