పూజలు చేశామనడంలో వాస్తవం లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటికి రావాలని టిడిపి నేతలు పూజలు చేశారని అనడంలో వాస్తవం లేదని యువకులు అన్నారు.మిడుతూరు మండల పరిధిలోని పై పాలెం గ్రామంలో బుధవారం రోజున వినాయకుని దగ్గర గ్రామ ప్రజలు మరియు కమిటీ యువకులు వినాయకునికి పూజలు నిర్వహించారు.ఆరోజున వినాయకుడి దగ్గర తీసిన యువకుల ఫోటోలను కొందరు గ్రామానికి చెందిన వారు రాజకీయ పార్టీ పాత్రికేయుల గ్రూపులో వేయటం వలన అక్కడ ఉన్న యువకుల ఫోటోతో సహా పత్రికలో వచ్చిన సంగతి తెలుసు.కానీ వినాయకుని దగ్గర కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పూజలు నిర్వహించామని రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని వారు అన్నారు.ఆ ఫోటోలో ఉన్నది ఇద్దరు మాత్రమే టిడిపి వారని యువకులు మరియు చదువుతున్న విద్యార్థుల ఫోటోలు రాజకీయ పార్టీల గ్రూపులో పంపడం మంచి పద్ధతి కాదని వారు అన్నారు. మేము వినాయక నిమజ్జనాన్ని ఘనంగా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మేము అందరం కలిసి మెలిసి ఉన్నామని యువకులు తెలిపారు.