అభ్యుదయానికి గురజాడ అడుగు జాడ
1 min readఅరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్ధానిక శాంతి టాలెంట్ స్కూల్ లో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 161 వ జయంతినీ ఘనంగ నిర్వహించారు.అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి కలిసి గురజాడ అప్పారావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, గురజాడ అభ్యుదయానికి అడుగు జాడ అని అన్నారు.గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి వాడుక బాషా ఉద్యమాన్ని నడిపించారని,గురజాడ రచనలు నేటి యువ కవులకు మార్గదర్శి అన్నారు.తన కవితలు సరళ మైన భాష లో రచించి సామాన్య ప్రజలకు కూడా అర్థం అయ్యేవిదంగా రాశారు అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా తను స్వతహాగా ముత్యాల సరాలు అనే నూతన వరవడిని సృష్టించుకున్నారు అన్నారు.కన్యా శుల్కం,దేశభక్తి మొదలగు రచనలు సామాజిక రుగ్మతలను ఎత్తి చూపాయి.గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అన్నారు.కులమతాల పైన తన కవిత ఖడ్గం జులిపించారాన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,రహం తుల్ల,హమీద్,విజయ భారతి, యోగేశ్వర్,మహబూబి,ఈశ్వరి,స్పూర్తి మొదలగు వారు పాల్గొన్నారు.