సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల నిమిత్తం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.80వేల చెక్కును సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామం మల్లూరువాండ్ల పల్లెకు చెందిన మదనపల్లె శివయ్య భార్య కృష్ణమ్మకు ప్రభుత్వ చీఫ్ విప్ అందజేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబానికి సీఎం ఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేయడం వల్ల కొంత ఊరట కలిగిందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా కృష్ణమ్మ తెలిపారు.