విశ్వబ్రాహ్మణులు ఆధునిక యంత్ర వినియోగంపై ఎందుకు కృషి చేయాలి
1 min readకేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పురందేశ్వరిని కలిసిన..
విశ్వబ్రాహ్మణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ శివశ్రీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో ఇండస్ట్రియల్ టూర్ ను చేర్చి అధునికఉత్పత్తులు ఆధునికయంత్రవినియోగంపై హస్తకళాకారులకు అవగాహనకల్పించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశంకల్పించేవిధంగా కేంద్రప్రభుత్వందృష్టికితీసుకువెళ్ళాలని భారతీయజనతాపార్టి రాష్ట్రఅధ్యక్షురాలు దగ్గుబాటిపురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణధర్మపీఠంప్రధాన సంచాలకులు విశ్వబ్రాహ్మణసంఘ జిల్లాప్రధానకార్యదర్శి అప్పలభక్తులశివకేశవరావు (శివశ్రీ)కోరారు ఏలూరుపర్యటనకు వచ్చినసందర్భంగా ఈమేరకు అధ్యక్షురాలు పురంధరేశ్వరికి రాష్ట్రకార్యదర్శి గారపాటి శీతారామాంజ నేయచౌదరికి వినతిపత్రాన్ని సమర్పించారు. స్వాతంత్ర్య అనంతరం విశ్వకర్మ పేరుతో జాతీయ స్థాయిలో సాంప్రదాయ హస్త కళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మకౌశల్ యోజన పేరిట పథకాన్ని ప్రకటించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు. విశ్వకర్మ సాంప్రదాయ ప్రధాన ఉత్పత్తులు ఐదు నైపుణ్యము సృజనాత్మకత కూడినవని.మానవ మనుగడ కోసం విశ్వకర్మ పరమాత్మ చేసృష్టింపడిన ఈ ఐదు హస్తకళలు అయో శిల్పము (బ్లాక్ స్మిత్) దారు శిల్పము (కార్పెంటరి) తామ్ర శిల్పం (బ్రాసరి) శిలా శిల్పము( స్టోన్ కార్వింగ్) స్వర్ణ శిల్పము (గోల్డ్స్మిత్) ఈ పంచధాతువులతో సృష్టించుట విశ్వకర్మ సాంప్రదాయ విశ్వబ్రాహ్మణుల వంశపారంపర్య కర్తవ్యం గా ఉన్నాయని వివరించారు మనుబ్రహ్మ, మయబ్రహ్మ,త్వష్ట బ్రహ్మ ,శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మలపరంపరగా, వంశపారంపర్యంగా ఈ ఐదువృత్తులపై ఆధారపడి సమాజ కళ్యాణానికి అంకితమై జీవనాన్ని సాగిస్తున్న వారే విశ్వబ్రాహ్మణులన్నారు. వీరు నిర్మించిన అద్వితీయమైన నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు అపురూపమైన శిల్ప సంపద, భారతదేశానికి ఖ్యాతిని విదేశీ మారకద్రవ్యాన్ని సైతం ఆర్జించి పెడుతున్నాయని కానీ చరిత్రలో అనాదిగా ఈ జాతిపై జరిగిన కుట్రలు కుతంత్రాల వల్ల ఆధునికమైన ఉత్పత్తుల వల్ల యీ ఉత్పత్తులకు ఆదరణ కోల్పోయి కేవలం వృత్తిపనివారిగా చాలీచాలని ఆదాయంతో ఆర్థిక సామాజిక విద్యాఉద్యోగ రాజకీయ రంగాలలో అభ్యున్నతిని సాధించలేకపోయారనివినతిపత్రంలో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యీ అయిదు ప్రధాన వృత్తుల తో పాటు యీ వృత్తులపై ఆధారపడిన 13రకాల ఉపఉత్పత్తి దారులకు సైతం ప్రయోజనం చేకూరేలా పీఎం విశ్వకర్మ యోజన పథకానికి రూపకల్పన చేయడం మాకు లభించిన గౌరవంగా ప్రోత్సహంగా భావిస్తున్నాంమని శివశ్రీపేర్కొన్నారుఅయితే ఈ పథకంలో కొన్ని సవరణలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా మీరందించే శిక్షణ ఆర్థిక సహకారం మార్కెటింగ్ సదుపాయాలతో పాటు ఏ వస్తువునైనా ఉత్పత్తి చేయగల నైపుణ్యము సామర్ధ్యము కలిగిన ఉత్పత్తిదారులను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకుగాను నేడు మార్కెట్లో ఆదరణ ఉన్న డిమాండ్ ఉన్న ఆధునిక వస్తు ఉత్పత్తుల పరిశ్రమలను సందర్శించి అవగాహన కలిగించే విధంగా ఈపథకంలో ‘ఇండస్ట్రియల్ టూర్’ ఏర్పాటు చేయాలనికోరారు ఆసక్తి కలిగిన యువత ఈ పథకంలో భాగంగా పరిశ్రమలను నెలకొల్పుటకు ముందుకు వచ్చే సందర్భాలలో మైక్రోస్థాయి నుండి చిన్నతరహా పరిశ్రమల స్థాపించుకునేందుకు కోటి రూపాయల వరకు ఇదే నిబంధనలతో వర్తింప చేసే విధంగా విశ్వకర్మ పథకంలో వెసులుబాటు కల్పించాలని ఆయనసూచించారు. ప్రధానంగా ఆధునిక ఉత్పత్తి రంగాల్లో ఇండస్ట్రియల్ టూర్ తో పాటు ఆయా పరిశ్రమల అవగాహన కొరకు స్వల్పకాలిక శిక్షణ పరిశ్రమ స్థాపన అనంతరం మార్కెటింగ్ సదుపాయం కొరకు ప్రత్యేక యంత్రాంగాన్ని (నోడల్ ఏజెన్సీని) ఏర్పాటు చేయాలని.తరతరాలుగా ఈ సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారు వారి అభిరుచికి అవగాహనకు తగిన విధంగా ఇతర పరిశ్రమలు స్థాపించుకునేందుకు వెసులుబాటు కల్పించాలనిఈ విధమైన ప్రోత్సాహాన్ని అందించినప్పుడు మాత్రమే జన్మతః సృజనాత్మకత ఏ వస్తునైనా ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన విశ్వకర్మ సాంప్రదాయ ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగగలుగుతారని తెలిపారు . అప్పుడు మాత్రమే పీఎం విశ్వకర్మ యోజన పథకం యొక్క లక్ష్యం నెరవేరుతుందని ఈఅంశాలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించవలశిందిగా శివశ్రీ కోరారు.ఈసందర్భంగా తెలుగుశిల్పులవైభవం గ్రంధాన్ని పురంధరేశ్వరికి బహూకరించారు.