తొమ్మిదో రోజూ టిడిపి నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్టులకు నిరసనగా పత్తికొండ నియోజకవర్గం లో చేపట్టిన నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. టిడిపి పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 9 వ రోజు జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్, రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ బాబు గారికి తోడుగా… ఒక్క నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ, స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద టిడిపి శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 9వరోజు నియోజకవర్గ కురవ సంఘం కమిటీ నిరాహారదీక్ష శిబిరం వద్ద దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం తెలుపుతూ, నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి, రామనాయుడు, అశోక్ కుమార్, తిరుపాలు, పెద్దహుల్తి, హోసూరు, నలకది మాజీ సర్పంచులు తిప్పన్న, హోసూరు శ్రీనివాసులు, బత్తిని లోకనాథ్, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్, బీటీ గోవిందు, తిమ్మయ్య చౌదరి, శ్రీనివాసులు గౌడు, గోవిందు గౌడు, సురేంద్ర, బురుజుల పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.