హైదరాబాద్‌కు విస్తరించిన అడెల్ఫీ విశ్వవిద్యాలయం
1 min read– 2023 ఫాల్ సీజన్‌కు విద్యార్థులకు స్వాగతం
– యూనివర్సిటీ హబ్‌తో భాగస్వామ్యం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: అమెరికాలో న్యూయార్క్ నగరానికి తూర్పున కేవలం 23 మైళ్ళ దూరంలో ఉండి, 125 సంవత్సరాలకు పైగా విశేషమైన వారసత్వం కలిగిన అడెల్ఫీ విశ్వవిద్యాలయం భారతదేశంలోని హైదరాబాద్ నుంచి విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని ఆదిత్య పార్క్ హోటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అడెల్ఫీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ డెబోరా హంట్ మాట్లాడుతూ, “మా సంస్థ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఉన్నతవిద్యకు దిక్సూచిగా ఉంది. భారతదేశంలోని హైదరాబాద్ నగరానికి కూడా మా పరిధిని విస్తరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా వైవిధ్యమైన గ్లోబల్ స్టూడెంట్ బాడీ మా ప్రాంగణాన్ని సుసంపన్నం చేస్తుంది. అది మేము అందించే విద్య నాణ్యతను పెంచుతుంది” అని చెప్పారు. హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్, బిజినెస్ ఎనలిటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలను అందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం.. 2023 ఫాల్ సెమిస్టర్ కోసం విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సర్వీస్ పార్టనర్ యూనివర్సిటీ హబ్ భాగస్వామ్యంతో అడెల్ఫీ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఎక్కువగా చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా, ప్రస్తుత కాలానికి బాగా అవసరమైన సప్లై చైన్ మేనేజ్ మెంట్, కంప్యూటర్ సైన్స్ వంటి కొత్త కోర్సులను 2024 స్ప్రింగ్ సీజన్ కోసం ప్రవేశపెడుతోంది.ఈ సందర్భంగా అడెల్ఫీ యూనివర్సిటీ రాబర్ట్ బి.విలంస్టాడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డాక్టర్ మేరీ ఆన్నే హైలాండ్ మాట్లాడుతూ, “అమెరికాలో వ్యాపారం, సాంకేతిక ఆవిష్కరణలలో న్యూయార్క్ నగరం ముందంజలో ఉంది. సమూల మార్పులతో కూడిన విద్యాప్రయాణంలో భాగంగా ఈ డైనమిక్ ఎకనమిక్ హబ్ లో విద్యార్థులను నిమగ్నం చేయడం మాకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.అడెల్ఫీ యూనివర్సిటీలోని బిజినెస్ ఎనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ప్రోగ్రాంలలో ఎంఎస్ కోర్సులు హైబ్రిడ్ నమూనాలో ఉంటాయి. ప్రతి టర్మ్ లో ఆన్ లైన్, ప్రత్యక్ష తరగతులు రెండూ ఉంటాయి. ఈ విధానం ప్రపంచ కనెక్టివిటీ, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్‌కు ప్రోత్సాహం లభిస్తుంది. విశ్వవిద్యాలయ లీడర్షిప్, ప్రోగ్రాం ప్రొఫెసర్లు విద్యార్థులతో చురుకుగా పాల్గొంటారు.డాక్టర్ హంట్ మాట్లాడుతూ, “మా కోర్సులు విద్యార్థుల అవసరాలను తీర్చేలా రూపొందించాం. అదే సమయంలో మా ప్రపంచ బాధ్యతను అవి నొక్కి చెబుతాయి. ఇప్పుడు, భవిష్యత్తులో మా విద్యార్థులకు ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలకు తలుపులు తెరిచే అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులు అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అన్నారు.1896లో స్థాపించిన అడెల్ఫీ విశ్వవిద్యాలయం.. అమెరికాలో అత్యంత పురాతన ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న న్యూయార్క్ విశ్వవిద్యాలయాలలో ఒకటి. 43 రాష్ట్రాలు, 72 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు. ఈ సంస్థ అమెరికా న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ నుంచి ఉత్తమ జాతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.యూనివర్సిటీ హబ్‌తో భాగస్వామ్యంలో భాగంగా అడెల్ఫీ విశ్వవిద్యాలయం భారతదేశంలో “స్పాట్ అడ్మిషన్స్” కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలు నిర్దిష్ట కోర్సులను అన్వేషించడానికి, అడెల్ఫీ ప్రవేశాల ప్రతినిధులు, నాయకత్వంతో కలిసి మాట్లాడేందుకు, విద్యా నైపుణ్యం, కెరీర్ పురోగతి వైపు వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి విద్యార్థులు, వాళ్ల కుటుంబాలను ఆహ్వానిస్తాయి.అడెల్ఫీ విశ్వవిద్యాలయం గురించి..న్యూయార్క్ నగరంలో ఉన్న అడెల్ఫీ విశ్వవిద్యాలయం, విద్యార్థుల జీవితాలను మార్చడంలో నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన జాతీయస్థాయి డాక్టోరల్ పరిశోధన విశ్వవిద్యాలయం. చిన్న తరగతులు, ప్రసిద్ధ అధ్యాపకులు, హ్యాండ్ ఆన్ లెర్నింగ్, సృజనాత్మక మద్దతు ద్వారా, అడెల్ఫీ అద్భుతమైన లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కార్యక్రమాలను, అలాగే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తుంది. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, స్టెమ్ అండ్ సోషల్ సైన్సెస్, బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్స్, హెల్త్ అండ్ వెల్నెస్ విభాగాల్లో అడెల్ఫీ రాణిస్తోంది.యు.ఎస్. న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ ద్వారా ఉత్తమ కళాశాలగా గుర్తింపు పొందిన అడెల్ఫీ విశ్వవిద్యాయలం.. మన్‌హట్టన్‌లోని కల్చరల్, ఇంటర్న్‌షిప్ అవకాశాలకు కేవలం 23 మైళ్ల దూరంలోనే ఉంది. ఇక్కడ తన అందమైన గార్డెన్ సిటీ క్యాంపస్‌లో 7,400 మందికిపైగా విద్యార్థులను చేర్చుకుంటుంది. ఇది తన ఆన్లైన్ కోర్సులతో పాటు న్యూయార్క్ నగరం, హడ్సన్ వ్యాలీ, సఫోక్ కౌంటీలలో డైనమిక్ లెర్నింగ్ హబ్‌లను కూడా నిర్వహిస్తుంది. అడెల్ఫీ ఇప్పటివరకు 1,19,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లను వృత్తిపరంగా రాణించడానికి, వారి సమాజాలు, ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపే నైపుణ్యాలతో సిద్ధం చేసింది.యూనివర్సిటీ హబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అనిల్ పల్లా అడ్మిషన్ల ప్రక్రియపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకోవాలనే వారి కలను సాకారం చేయడంలో సుమారు లక్ష మంది విద్యార్థులకు సహాయం చేయడంలో యూనివర్సిటీ హబ్ ట్రాక్ రికార్డును ఆయన హైలైట్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అవసరమైన ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులకు 10 రోజుల్లో ఐ-20 అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న విద్యార్థులకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది.యూనివర్సిటీ హబ్ సేవలు పూర్తిగా ఉచితమని, విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాల ఆధారంగా సరైన కోర్సు, కళాశాలను ఎంచుకోవడానికి సహాయపడతాయని డాక్టర్ అనిల్ పల్లా స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి అమెరికాకు వెళ్లడం, మాస్టర్స్ డిగ్రీ చదవడం, ఉద్యోగం సంపాదించడం, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం వరకు… యూనివర్సిటీ హబ్ నిరంతర మద్దతును అందిస్తుంది. ఈ సంస్థ ఉచిత ఐఈఎల్టీఎస్ శిక్షణను కూడా అందిస్తుంది, ఇది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.