అసెంబ్లీలో బాలకృష్ణ పై అంబటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు..
1 min readఅంబటిపై ఎన్.బి.కె. ఫాన్స్ టౌన్ అధ్యక్షులు సింగం శ్రీనివాసులు ఫైర్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు రెచ్చగొట్టే విధంగా బాలకృష్ణ పై మాట్లాడడం హేమమైన చర్య అని పత్తికొండ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ టౌన్ అధ్యక్షులు సింగం శ్రీనివాసులు మండిపడ్డారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం బాలకృష్ణ అభిమానులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగం శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీలో తమ ప్రియతమ అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ పై అంబటి రాంబాబు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు యావత్ తెలుగు రాష్ట్రాలలో నందమూరి అభిమానులలో తీవ్ర ఆవేశాలను కలిగిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో నందమూరి కుటుంబం పై నందమూరి బాలకృష్ణ పై అవాకులు, చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సింగం శ్రీనివాసులు ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం నందమూరి బాలకృష్ణకి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని లేకపోతే నందమూరి బాలకృష్ణ అభిమానుల చేత తీవ్ర నిరసనలు ఎదుర్కోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా వైయస్సార్ ప్రభుత్వం చర్యలు మానుకొని సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులు మీరా హుస్సేన్ చంద్రశేఖర్ రంగస్వామి తోపాటు పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.